నగదుకు తగ్గ విలువనూ అందిస్తాం

 నగదుకు తగ్గ విలువనూ అందిస్తాం

హైదరాబాద్, వెలుగు: గోద్రేజ్‌‌ గ్రూప్‌‌నకు చెందిన గొద్రేజ్‌‌ అండ్‌‌ బాయ్‌‌సీ బ్రాండ్‌‌  గోద్రేజ్‌‌ లాక్స్‌‌ అండ్‌‌ ఆర్కిటెక్చరల్‌‌ ఫిట్టింగ్స్‌‌అండ్‌‌ సిస్టమ్స్‌‌ కాటస్‌‌ శ్రేణి డిజిటల్‌‌ డోర్‌‌ లాక్స్‌‌ను లాంచ్​ చేసింది.  -లిఫ్ట్‌‌ బెడ్‌‌ ఫిట్టింగ్స్‌‌, హికిడో వార్డ్‌‌రోబ్‌‌ ఫిట్టింగ్స్‌‌నూ పరిచేయం చేసింది. ఇవి టెక్నాలజీపరంగా అత్యున్నతంగా ఉండటం మాత్రమేగాక, నగదుకు తగ్గ విలువనూ అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. లాకింగ్‌‌ సెగ్మెంట్​లో మరిన్ని కొత్త ప్రొడక్టులను లాంచ్​ చేస్తామని వెల్లడించింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరానికి రూ.2,500 కోట్ల ఆదాయాన్ని టార్గెట్​గా పెట్టుకుంది.

గోద్రేజ్‌‌ లాక్స్‌‌ ఇండియా మార్కెట్లో 200కు పైగా ప్రొడక్టులను అమ్ముతున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఆర్కిటెక్చరల్‌‌ ఫిట్టింగ్స్‌‌ అండ్‌‌ సిస్టమ్‌‌ పరిశ్రమలో రాబోయే మూడు సంవత్సరాలలో  టాప్‌‌ 3 బ్రాండ్లలో ఒకటిగా నిలవడంపై ఫోకస్​ చేసింది. ఆర్కిటెక్చరల్‌‌ ఫిట్టింగ్స్‌‌ విభాగం మార్కెట్​విలువ రూ.20 వేల కోట్ల వరకు ఉంటుంది.

ఇండ్లకు తగిన రీతిలో అత్యాధునిక డిజైన్‌‌ సొల్యూషన్లను అందించడం ద్వారా  2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్కిటెక్చరల్‌‌ ఫిట్టింగ్స్‌‌ సెగ్మెంట్​ నుంచి రూ.400 కోట్లు సంపాదిస్తామని గోద్రేజ్‌‌ లాక్స్‌‌ అండ్‌‌ ఆర్కిటెక్చరల్‌‌  ఫిట్టింగ్స్‌‌, సిస్టమ్స్‌‌  బిజినెస్‌‌ హెడ్‌‌ శ్యామ్‌‌ మొత్వానీ అన్నారు.