2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు

హైదరాబాద్, వెలుగు: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పుష్కరాల నిర్వహణపై  తొలి సమావేశం జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్‌‌, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు.