ముగిసిన గోదావరి బోర్డు మీటింగ్

ముగిసిన గోదావరి బోర్డు మీటింగ్

హైదరాబాద్: గోదావరి బోర్డు మీటింగ్ ముగిసింది. శుక్రవారం జలసౌధలో గోదావరి రివర్  బోర్డు సమావేశమైంది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై బోర్డుకు ఫిర్యాదు చేసింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి గోదావరిపై తెలంగాణ, ఏపీకి మధ్య ఎలాంటి వివాదాలు లేవు. కానీ పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కృష్ణ రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయడంతో… గోదావరి ప్రాజెక్టులపై మెలిక పెట్టింది ఏపీ. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ఫేజ్ 3, తుపాకుల గూడెం, మిషన్ భగీరథలకు అనుమతులు లేవని గోదావరి రివర్ బోర్డ్ కు ఫిర్యాదు చేసింది. పెన్ గంగ రివర్ పై తెలంగాణ నిర్మిస్తున్న చనకా కొరాటా, రాజ్ పెట్, పిం పరాడ్ బ్యారేజీలు, రామప్ప లేక్ నుంచి పాకాలా డైవర్షన్ స్కీం లు ఆపేయలంటూ కంప్లెయింట్ చేసింది.