న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని.. ఊహించిన దానికంటే 10.7% అదనంగా లిస్టులోకి చేరాయని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 671 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే స్టేట్ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ లాంటి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చిందన్నారు.
గత డిసెంబర్ కంటే ముందు నమోదైన కేసుల కంటే.. క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత నమోదైన కేసుల సంఖ్య రెట్టింపుగా ఉందని... ఆదివారం నాటికి కొవిడ్ పాజిటివిటీ రేటు 10.7శాతం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
మరోవైపు..అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. జనవరి 26వ తేదీ వరకూ ఫిజికల్ సెషన్స్ అయిన క్లాస్ 8, క్లాస్ 9 పిల్లలు రేపటి నుంచి స్కూల్స్ కు రావొద్దని చెప్పేశారు. 11, 12 తరగతి చదివే పిల్లలు వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలన్నారు.
మరిన్ని వార్తల కోసం..
