గోవాలో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో గోవాలో లాక్డౌన్ను జూన్ 7 వరకు పొడిగిస్తూ సీఎం ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకున్నారు. రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని శనివారం ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆదేశాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారన్నారు. అత్యవసర, నిత్యావసర వస్తువుల షాపులు,లిక్కర్ షాపులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటాయని చెప్పారు. మెడికల్ స్టోర్స్, రెస్టారెంట్ కిచెన్స్ ఉదయం 7 నుండి సాయంత్రం 7గంటల వరకు అనుమతి ఉందని తెలిపారు.
