పీయూ వీసీగా జీఎన్​ శ్రీనివాస్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్  శ్రీనివాస్  నియమితులయ్యారు. ప్రస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్​లో సీనియర్  ప్రొఫెసర్, ఎలక్ట్రికల్  అండ్  ఎలక్ట్రానిక్  ఇంజినీర్ గా కొనసాగుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్​ బీటెక్, ఎంటెక్, పీహెచ్​డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలోనే అసిస్టెంట్  ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. 2003లో ఉమ్మడి ఏపీ జేఎన్టీయూ అనంతపురంలో అసోసియేట్  ప్రొఫెసర్ గా సేవలందించారు.

ఎలక్ట్రికల్  ఇంజనీరింగ్  విభాగాధిపతిగా, వైస్  ప్రిన్సిపాల్ గా, ప్రిన్సిపాల్ గా, వివిధ అఫిలేటెడ్  కాలేజీలకు బోర్డ్  ఆఫ్  స్టడీస్  మెంబర్​గా,  మాలవీయా టీచర్స్ సెంటర్ కు డైరెక్టర్ గా కొనసాగారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్లు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో జేఎన్టీయూహెచ్ లో క్రియాశీలక పాత్ర పోషించారు. టీచర్  అసోసియేషన్  అధ్యక్షులుగా, తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పడ్డ శ్రీ కృష్ణ కమిటీకి ఉద్యోగుల సమస్యలు, యూనివర్సిటీల స్థితిగతులపై వినతిపత్రం అందజేశారు.