- స్టార్టప్ జినోమ్ అనే సంస్థ ఆసియా దేశాల్లోని నగరాలపై 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్‌ను 12వ సారి విడుదల చేసింది.
- గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన అంకుర సంస్థల నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో న్యూయార్క్ నగరం, లండన్లు వరుసగా నిలిచాయి.
- ఈ జాబితాలో 6వ స్థానంలో బెంగళూరు, ఏడో స్థానంలో ఢిల్లీ, 10వ స్థానంలో ముంబయి, 26వ స్థానంలో పుణె నిలిచాయి. హైదరాబాద్ తొలిసారిగా ఆసియాలోనే 19వ స్థానంలో నిలిచి స్టార్టప్‌లకు అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది.
- గత దశాబ్దంలో హైదరాబాద్‌లో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగి 200 నుంచి 7500లకు పైగా చేరుకుంది. ఈ అభివృద్ధి ఫలితంగా హైదరాబాద్ ఆసియాలో అంకుర సంస్థలకు బెస్ట్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ కలిగిన నగరాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.