AUS Vs PAK: మ్యాక్స్ వెల్‌తో మాములుగా ఉండదు.. 140 కి.మీ బంతిని రివర్స్ స్వీప్‌తో సిక్సర్ బాదేశాడు

బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర హిట్టర్ సూపర్ షాట్ తో అలరించాడు. తనకే సాధ్యమైన రివర్స్ స్వీప్ తో మరోసారి వావ్ అనేలా చేశాడు. అయితే ఈ షాట్ ఫాస్ట్ బౌలింగ్ లో కొట్టడం వైరల్ గా మారింది. తొలి టీ20లో భాగంగా షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని వేగంగా విసిరాడు. ఈ బంతిని మ్యాక్సీ థర్డ్ మ్యాన్‌ దిశగా సిక్సర్ బాదాడు. దాదాపు  140 కి.మీ బంతిని మ్యాక్స్ వెల్ రివర్స్‌ స్వీప్ తో సిక్సర్ కొట్టడం ఆసీస్ ఇన్నింగ్స్ కు హైలెట్ గా నిలిచింది. 

పేస్‌ బౌలింగ్ కావడం.. బౌండరీ 65 మీటర్లే ఉండడంతో ఈజీగా ఫ్లాట్ సిక్సర్ వెళ్ళింది. ఈ మ్యాచ్ లో అతను ఎదుర్కొన్న తొలి బంతినే నజీమ్ షా బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఫోర్ కొట్టాడు. అద్భుతమైన షాట్స్ తో పాటు బ్యాటర్ గాను మ్యాక్స్ వెల్ చెలరేగాడు. 19 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. స్టయినీస్ 7 బంతుల్లోనే 21 పరుగులు చేసి వేగంగా ఆడాడు. 

ALSO READ | Ranji Trophy 2024-25: RTM కార్డు ఇతనికే: ట్రిపుల్ సెంచరీతో దుమ్మలేపిన RCB బ్యాటర్

ఇరు జట్ల మధ్య ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ కూడా గెలిచి ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.