“నా గర్ల్ ఫ్రెండ్ గుర్తించింది”

“నా గర్ల్ ఫ్రెండ్ గుర్తించింది”

సిడ్నీ: తనలోని మానసిక సమస్యను మొదట గుర్తించింది తన గర్ల్‌‌ఫ్రెండేనని ఆస్ట్రేలియా ఆల్‌‌రౌండర్​ మ్యాక్స్‌‌వెల్‌‌ తెలిపాడు. నాలుగైదేళ్లుగా విరామం లేకుండా క్రికెట్‌‌ ఆడటంతో మానసికంగా, శారీరకంగా అలసిపోయానని చెప్పాడు. ‘మానసిన సమస్యతో చాలా ఇబ్బందులుపడ్డా. పెద్ద బరువు మోస్తున్నట్లు అనిపించేది. ఈ సమస్యను మొదట గుర్తించిన నా గర్ల్‌‌ఫ్రెండ్‌‌ రెస్ట్​ తీసుకోమని సలహా ఇచ్చింది. ఈ బ్రేక్‌‌ టైమ్‌‌ను పూర్తిగా కుటుంబం, స్నేహితులకే కేటాయించా. ఇంట్లోనే గడిపా. ఫిట్‌‌గా మారేందుకు ఎక్కువగా కృషి చేశా. బ్రేక్‌‌ తీసుకున్న తొలి రోజుల్లో నన్ను భరించేందుకు నా పార్ట్‌‌నర్‌‌ చాలా కష్టపడింది. అకాడమీ డేస్‌‌లో నన్ను బలంగా మార్చిన మైకేల్‌‌ లాయడ్‌‌ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. చాలా రోజులు విశ్రాంతి అవసరం పడుతుందేమోనని అనుకున్నా. కానీ తొందరగా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నా’ అని మ్యాక్స్‌‌వెల్‌‌ పేర్కొన్నాడు. బ్రేక్ కావాలని అడిగిన వెంటనే అనుమతిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ విక్టోరియాకు, అండగా నిలిచిన క్రికెటర్లకు ధన్యవాదాలు చెప్పాడు.