ఉత్పాదక రంగాలకు బాగా అప్పులు ఇవ్వండి.

ఉత్పాదక రంగాలకు బాగా అప్పులు ఇవ్వండి.

న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను త్వరగా పట్టాలెక్కించడానికి ఉత్పాదక రంగాలకు ఎక్కువ అప్పులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్​బీ) కోరింది.   బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌టెక్​లతో పార్ట్​నర్​షిప్​లకు, కో–లెండింగ్​ బిజినెస్​కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరింది.  రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడుతున్న ఫైనాన్షియల్​ టెక్నాలజీతోపాటు ఇతర సెక్టార్లకూ అప్పులు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్​బీ బాసులకు స్పష్టం చేసింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పీఎస్​బీల పనితీరుపై రివ్యూ చేసింది.  మరింత ఎక్కువగా లోన్లు ఇవ్వడానికి టెక్నాలజీని,  డేటా అనలిటిక్స్‌‌‌‌పై దృష్టి పెట్టాలని బ్యాంకులను కోరింది. మోసాలను అరికట్టేందుకు ఐటీ భద్రతా వ్యవస్థలను, సైబర్‌‌‌‌ సెక్యూరిటీని పటిష్టం చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్​లను మంత్రిత్వ శాఖ కోరింది. ఆర్​బీఐ  తాజా డేటా ప్రకారం, పీఎస్​బీల లోన్ల గ్రోత్​ ఏడాది క్రితం 3.6శాతం నుండి 2022 మార్చిలో 7.8శాతంకి మెరుగుపడింది. కొన్ని పీఎస్​బీలు 26 శాతం గ్రోత్​ని రికార్డు చేశాయి కూడా.