డెహ్రాడూన్: చిరిగిన జీన్స్ వేసుకోవడం మన దేశ కల్చర్ కాదంటున్నారు ఉత్తరాఖండ్ సీఎం తిరథ్ సింగ్ రావత్. ఇలాంటి ప్యాంట్లను ధరించడం వల్ల పిల్లలకు పేరెంట్స్ తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని రావత్ మండిపడ్డారు. ఇలాంటి వాటి వల్లే డ్రగ్స్ వాడకం లాంటివి కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ‘ఇదంతా కత్తెర సంస్కారం. మోకాళ్లు చూయించడం, చిరిగిన ప్యాంట్లు వేసుకోవడం, రిచ్ కిడ్స్‌లా బిల్డప్ ఇవ్వడం కనిపిస్తున్నాయి. ఇవేనా మన విలువలు? టీచర్ల నుంచో స్కూల్స్ నుంచో ఇలాంటివి వస్తున్నాయా? ఇదేమన్నా మంచి సంస్కృతా? మనం నగ్నత్వం దిశగా వెళ్తున్నామా? అమ్మాయిలు కూడా తక్కువేం కాదు. వాళ్లు మోకాళ్లు కనిపించేలా జీన్స్ వేసుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని పిచ్చిగా ఫాలో అవ్వడం ఏంటో? శరీరాన్ని పూర్తిగా కవర్ చేస్తూ బట్టలు వేసుకోవడం మన కల్చర్. యోగా మన సంస్కృతి. యోగాను విదేశీయులు ఫాలో అవుతుంటే మనం మాత్రం చిరిగిన జీన్స్ కల్చర్‌ను అనుసరిస్తున్నాం’ అని రావత్ ఫైర్ అయ్యారు.
