దృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్‌లు చేస్తూ మేనేజ్

దృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్‌లు చేస్తూ మేనేజ్
గర్ల్​ఫ్రెండ్‌ను చంపి.. గోడలో దాచిండు మహారాష్ట్రలో ఓ ప్రియుడి ఘాతుకం పాల్ఘర్(మహారాష్ట్ర): ప్రేమించానని చెప్పిండు.. ఇంట్లోకెళ్లి తీసుకెళ్లి ఓ ఫ్లాట్‌లో సహజీవనం మొదలెట్టిండు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోందని చంపేసిండు. అదే ఫ్లాట్‌లో ఓ గోడ కట్టి అందులో శవాన్ని దాచిండు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు.. పాల్ఘర్ జిల్లాకు చెందిన సూరజ్ హర్ మల్కర్(34), అమిత మోహితె(30) ప్రేమించుకున్నారు . కొన్ని రోజుల కింద ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఇద్దరూ పాల్ఘర్ చేరుకున్నారు . ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. మోహితె ప్రేమ విషయం తెలుసుకుని ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో పెళ్లి చేసుకుందామని కొన్ని రోజులుగా మల్కర్ పై ఆమె ఒత్తిడి తీసుకొస్తోంది. దీనిపై ఇద్దరిమధ్య వాదోపవాదాలు కూడా జరిగాయని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకపోవడంతో మోహితెను అడ్డుతొలగించుకోవాలని మల్కర్ నిర్ణయించుకున్నడు. క్రైం సినిమాలు చూసి భయంకరమైన ప్లాన్ వేసిండు. తనను నమ్మి వచ్చిన మోహితెను చంపేసి, శవాన్ని తనుండే ఫ్లాట్‌లోనే దాచిండు. కొత్తగా ఓ గోడ కట్టి, అందులో శవాన్ని పెట్టిండు. ఇంటా బయట అనుమానం రాకుండా ఆమె ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, ఫ్రెండ్స్​కు రిప్లై ఇస్తూ కొన్ని రోజులు మేనేజ్ చేసిండు. అయితే, పోయిన అక్టోబర్ 21 తర్వాత కూతురును చూడడం కానీ, ఆమె మాటలు వినడం కానీ చేయకపోవడంతో మోహితె పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మల్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. మర్డర్ విషయం బయటపడింది. పోలీసులు ఫ్లాట్‌లో గోడను పగలగొట్టి డెడ్ బాడీ అవశేషాలను స్వాధీనం చేసుకుని, అటాప్సీ కోసం హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మర్డర్ చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు మల్కర్ చెప్పా డని పోలీసులు వివరించారు. For More News.. ఐదు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ కట్టిన్రు న్యూస్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ల కట్టడి కోసం సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ బ్యాడ్​ బ్యాంకుల ఏర్పాటును పరిశీలిస్తాం