మెట్రోలో యువతి, యువకుడు ఫైటింగ్

మెట్రోలో యువతి, యువకుడు ఫైటింగ్

మెట్రో రైలులో యువతి, యువకుడు కొట్లాడుకున్నరు. చెంప చెల్లుమపనిపించడమే కాకుండా యువకుడిపై పిడిగుద్దులు కురిపించింది. టీ షర్టు విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ ప్రయాణీకుడు వీరి గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య మొదలైన గొడవ చెంపలు చెల్లుమనే దాక తీసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మెట్రో రైలులో యువకుడు, యువతి ప్రయాణీస్తున్నారు. టీ షర్టును రూ. 1000 పెట్టి కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని యువకుడికి తెలియచేసింది. అంత ధర ఉండదని.. కేవలం రూ. 150 కంటే ఎక్కువ ఉండదని బదులిచ్చాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది వీరి మధ్య గొడవ. అందరూ చూస్తుండగానే యువకుడి చెంప చెల్లుమనిపించింది.

అవసరం లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని యువకుడి చెప్పగానే మరోసారి కొట్టింది. తాను ఇంటికి వెళ్లి అమ్మకు చెబుతానని.. నీలాంటి వారు లేకున్నా ఫర్వాలేదు అంటూ మరోసారి కొట్టింది. వెంటనే ఆ యువకుడు కూడా యువతి చెంప చెల్లుమనిపించాడు. స్టేషన్ రాగానే వారిద్దరూ దిగిపోయారు. అక్కడున్న వారు నవ్వడం వీడియోలో కనిపించింది. kartik అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఢిల్లీ మెట్రో ఎంటర్ టైన్ మెంట్ క్యాప్షన్ జత చేశాడు. వీళ్లు కావాలనే అలా ఫ్రాంక్ చేసి ఉంటారని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరికి వివాహం అయితే.. భవిష్యత్ లో ఎలా ఉంటారోనంటూ సెటైర్స్ వేస్తున్నారు.