అనంతగిరి ప్రదక్షిణకు వేలాది భక్తులు

వికారాబాద్, వెలుగు: హిందూ జనశక్తి, మాణిక్ ప్రభు సంస్థాన్​ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్​లో నిర్వహించిన అనంతగిరి ప్రదక్షిణకు విశేష స్పందన వచ్చింది. మాణిక్ ప్రభు సంస్థాన్ గురూజీ బాల మార్తాండ మహరాజ్, అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ జనశక్తి నాయకులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు వికారాబాద్​లోని రాజీవ్ నగర్ భవానీమాత ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ యాత్ర మొదలైంది.

 మేకలగండి, శుభం ఫంక్షన్ హాలు, గోధుమగూడ మీదుగా జైదుపల్లి, కెరెళ్లి సత్యసాయి కేంద్రం, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, బండభావి హనుమాన్ ఆలయం మీదుగా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకుని ముగిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్​చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కుమార్, హిందూ జన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.