హైదరాబాద్ సిటీలో కాలం చెల్లిన ఆటోలు 2 వేలు.. సిటీ వదలాల్సిందే.. ఔటర్ దాటాల్సిందే..!

గ్రేటర్ హైదరాబాద్ లో కాలం చెల్లిన ఆటోలను ఔటర్ దాటించే పనిలో ఉన్నారు అధికారులు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని.. రాబోయే కాలంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను మొదలుపెట్టారు. అందులో భాగంగా 15 ఏండ్లు దాటిన ఆటోలను సిటీ దాంటిచే పనిలో ఉన్నారు. 

గ్రేటర్​లో అన్ని ఆటోలు కలిపి1.10 లక్షల వరకు ఉన్నాయి. 2002లో ఆటోలపై నిషేధం విధించే నాటికి 50 వేల నుంచి 60 వేల వరకు మాత్రమే ఉండగా, వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉపాధి కోసం 25 వేల ఆటోలకు పర్మిషన్​ఇచ్చారు.  మిగిలినవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చి దొడ్డిదారిన తిరుగుతున్నవేనని తేల్చారు. ఇందులో డీజిల్​ఆటోలు 15వేలకుపైగానే ఉంటాయని అధికారులు అంటున్నారు. 15 ఏండ్లు దాటిన ఆటోలు రెండు వేలలోపు ఉంటాయి.  వీటన్నింటినీ ఔటర్​దాటించాలన్న లక్ష్యంతోనే అధికారులు పని చేస్తున్నారు.