ముషీరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని గురువారం జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర మాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.