ప్రత్యర్ధుల పోటీని తట్టుకునేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త ఎత్తుగడ వేసింది.చిరుతిళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా రూ.10 చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన కొనుగోలు దారులకు మూడురోజుల పాటు 1జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ కోసం ఎయిర్ టెల్ పెప్సికో ఇండియాతో చేతులు కలిపింది.
చిప్స్, కుర్ కురే ప్యాకెట్స్ వెనక భాగంలో 1జీబీ ఫ్రీ ఇంటర్నెట్ డేటా కోడ్ ఉంటుంది. ఎవరైనా చిప్స్ ప్యాకెట్ కొనుగులు చేసి..ప్యాకెట్ వెనుక ఉన్న డేటా కోడ్ ను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసి, ఆపై మై కూపన్‌ల విభాగంలో ఎంటర్ చేయాలి. అప్పుడే డేటా వచ్చేస్తుందని ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. కాగా వినియోగదారులు డిజిటల్ కంటెంట్ చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ వెల్లడించారు.
