కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ పైనా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో జర్మనీ క్రమంగా ఇతర దేశాలపై ఆంక్షలు ఎత్తివేస్తోంది. ఆ దేశాల లిస్టులో భారత్ సహా ఐదు దేశాలు ఉన్నాయి. డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్ మంగళవారం ప్రకటించారు. జర్మనీ ప్రజలే కాకుండా ఈ దేశాలకు చెందిన ప్రజలు కూడా దేశంలో రావచ్చని చెప్పారు.
