UK నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ టెస్ట్

UK నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ టెస్ట్
దేశంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ బయటపడింది. యునైటెడ్ కింగ్ డమ్ నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త కరోనా వేరియంట్ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్ లో ఇద్దరు, పుణేలో ఒకరిలో కొత్త వేరియంట్ బయటపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోరోనాలో 17 మార్పులు జరిగాయని..అందులో ఎనిమిది ముఖ్యమైనవని తెలిపింది. కొత్త వేరియంట్ తో వ్యాధి తీవ్రత పెరుగుతోందని చెప్పింది. UK నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశంలో 10 ల్యాబ్ లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య UK నుంచి భారత్ కు  33 వేల మంది వచ్చారు. వారిలో 114 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో ఆరుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడింది. ఆరుగురిని సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వాలు.. వారితో కంటాక్ట్ అయినవారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటి వరకు 5వేల జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు చేశామని తెలిపింది.ఇప్పుడున్న వ్యాక్సిన్లు  కొత్త  వేరియంట్ కు కూడా పనిచేస్తాయంది కేంద్ర ఆరోగ్యశాఖ.