కుర్ర ఉద్యోగులు : జీతం ఏముందీ.. కెరీర్ కదా ముఖ్యం.. ఈ తరం ఉద్యోగుల అభిప్రాయం ఇదేనా..!

టెక్నాలజీని అందపుచ్చకున్న కొత్త తరాన్నే జెనరేషన్ Z అంటారు. 1990 నుంచి 2010 సంవత్సరాల మధ్య పుట్టిన వారిని జెనరేషన్ Z అని అంటారు. అయితే ఈ జెనరేషన్ ఎంప్లాయిస్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు సాలరీ కంటే కెరీర్ కే ప్రాధాన్యత ఇస్తున్నరట. అప్నా కంపెనీ, జాబ్ సెర్చ్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ వంటి జాబ్ సెర్చింగ్ ఫ్లాట్ ఫారమ్స్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రస్తుతం యువత ఉద్యోగాల్లో ఇచ్చే జీతం కంటే కెరీర్ డెవలప్‌మెంట్, మెంటార్ షిప్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్‌మెంట్ లాంటి వాటికే మొగ్గు చూపుతున్నారట. 

Gen Z విధానాలు చూసి ముందు అంతకు ముందు తరం వారు ఆశ్చర్యపోతున్నారు. జెడ్ జెనరేషన్ యూత్ నేర్చుకోవడం, డెవలప్ మెంట్ కు అత్యధిక వాల్యూ ఇస్తున్నారని రీసెర్చ్ లో తేలింది. ఏదైనా జాబ్ వస్తే ఇప్పుడు జీతం గురించి కాకుండా ఆ ఉద్యోగంలో చేరితే నేను ఎలా డెవలప్ అవుతాని ఆలోచిస్తున్నారు. 80శాతం Gen Z స్కిల్డ్ ఎప్లాయిస్ జీతం కంటే మెంటార్‌షిప్, స్పష్టమైన కెరీర్ వృద్ధి మార్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది పర్సనాలిటీ, ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ కోసం అంటున్నారు. 

ALSO READ | ఐఎస్​ఏలో చేరిన ఆర్మేనియా

అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో 10వేల మంది Gen Z నిపుణులతో నిర్వహించిన సర్వేలో ఈ కింది విషయాలు తెలిశాయి. వారి కెరీర్ ఇంపార్ట్ టెన్స్,  కార్యాలయంలోని అంచనాలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించబడింది. సర్వేలో కీలక పాయింట్లు ఇవే.. వర్క్‌ప్లేస్ ప్రాధాన్యతలు, కెరీర్ ఫోకస్, వర్క్ అస్ట్మాస్పీయర్, కో ఆపరేషన్, ఫీడ్‌బ్యాక్, వర్క్ కల్చర్ ఛేంజ్, హైబ్రిడ్ వర్క్ ప్రాధాన్యత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై దృష్టి వంటి అంశాల్లో ఎంత మంది ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారని సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాల్ని సేకరించి నివేదికలిచ్చారు.