పకడ్బందీగా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్

  • ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేశ్​ జైవంశీ

వనపర్తి, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల  సాధారణ పరిశీలకుడు రుచేశ్ జైవంశీ సూచించారు.  గురువారం ఆయన  జిల్లా కలెక్టర్​తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి వనపర్తిలోని చిట్యాల మార్కెట్ యార్డు గోదాములో ఏర్పాటు చేయనున్న డిస్టిబ్యూషన్ సెంటరును పరిశీలించారు.  

పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన మెటీరియల్ తోపాటు భోజన సదుపాయం కల్పించాలని సూచించారు.  అనంతరం వనపర్తి  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు 19/78, 20/78 ను సందర్శించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.