పవర్ ప్లాంట్లలో ప్రమాదాలు కొత్తేంకాదు

పవర్ ప్లాంట్లలో ప్రమాదాలు కొత్తేంకాదు

శ్రీశైలం లెఫ్ట్‌  బ్యాంక్‌ పవర్‌ ప్లాంట్ ప్రమాదంపై ఎస్పీడీసీఎల్‌సీఎండీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని ప్రభాకర్‌రావు చెప్పారు. సభ్యులుగా జేఎండీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌మిషన్‌‌ డైరెక్టర్ జగత్‌రెడ్డి , టీఎస్‌ జెన్‌‌కో ప్రాజెక్టు డైరెక్టర్ ‌సచ్చిదానందం, చీఫ్‌‌ ఇంజనీర్‌ రత్నాకర్‌ను నియమించామన్నారు. ప్రమాదంపై స్టడీ చేసి 15 రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని కమిటీని ఆదేశించామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌, వెలుగు: ప‌వ‌ర్ ప్లాంట్ల‌‌లో ప్ర‌మాదాలు కొత్తేమీ కాద‌ని జెన్‌‌కో, ట్రాన్ కో సీఎండీ ప్రభాక‌ర్ రావు అన్నారు.‌ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్పీటీసీలో బాయిలర్ ‌‌బ్లాస్ట్అయి 30 మంది చనిపోయారని, తమిళనాడులోనూ భారీ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. శ్రీశైలంలో పవర్‌‌ఎక్కువగా జనరేట్‌ చేశారు కాబట్టే ప్రమాదం జరిగిందనే ఆరో పణల్లో నిజం లేదన్నారు. శ్రీశైలం లెఫ్ట్‌‌బ్యాంక్‌ పవర్‌ ప్లాంట్ లో అగ్నిప్రమాదంపై ఆయన ఆదివారం ఆడియో ప్రకటన విడుదల చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఎక్స్‌‌గేషియా ఇవ్వలేదు. శ్రీశైలం పవర్‌‌ ప్లాంట్లో ప్రమాదంపై స్టడీ చేయడానికి జెన్‌‌కో ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని ప్రభాకర్రావు చెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఎక్స్‌‌గ్రేషియా ఇచ్చామని, జెన్‌‌కో నుంచి సాయం అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల్లో మృతుల కుటుంబాలకు ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వలేదని, అయినా మన ప్రభుత్వంఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

శ్రీశైలం ఘటన దురదృష్టకరమైందని, తొమ్మిది మంది చనిపోవడం, వారిలో ఏడుగురు ఇంజనీర్లుఉండటం బాధాకరమన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తాను, విద్యుత్‌‌శాఖ మంత్రి, ఇతర ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నామని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. రాత్రి మొత్తం రెస్క్యూ ఆపరేషన్‌ చేసినా లోపల చిక్కుకున్న వారిని కాపాడటం తమ డిపార్ట్‌‌మెంట్‌‌తో కాలేదన్నారు. వెంటనే ఎన్ఆడీ ర్‌‌ఎఫ్‌‌, సీఐఎస్‌ఎఫ్‌‌టీమ్లను పిలిపించామని చెప్పారు. పవర్ ‌‌ప్లాంట్ లోపల కరెంట్ పోవడంతో చీకటి అలుముకుందని, విపరీతమైన పొగతో లోపల చిక్కుకున్న వారికి ఆక్సీజన్ ‌‌దొరకలేదని పేర్కొన్నారు. కరెంట్‌ పోవడంతోనే వెంటిలేషన్‌ ఆగిపోయిందని, దీంతో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదని వివరించారు. ఆటోమేటిక్‌‌గా ట్రిప్‌ కావాలి.. కానీ కాలేదు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పవర్‌‌ప్లాంట్ లో కరెంట్ ఆటోమేటిక్‌గా ట్రిప్‌ కావాలని, కానీ అలా జరుగలేదని ప్రభాకర్ రావు చెప్పారు. ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తిందో స్టడీ చేయడానికి తాము ఇంటర్నల్‌ కమిటీ వేశామని ఆయన వివరించారు. ఇప్పటివరకు పవర్ ‌‌ప్లాంట్ లోపలికి వెళ్ల‌లేదని, వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పవర్‌‌ప్లాంట్ లో రోజుకు 800 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని, ఇంకో 15 రోజుల్లోనే రెండు యూనిట్లలో పవర్ జనరేషన్ ‌‌మొదలు పెట్టేందుకు జెన్‌‌కో ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం