రాజన్న ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడ, వెలుగు: వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  గీతా జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానచార్యులు అప్పాల భీమా శంకర శర్మ  అధ్వర్యంలో అర్చకులు ఉదయమే శ్రీ రాజరాజేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక  ఏకదాశ రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి దుర్గా సూక్త లలితా సహస్రనామార్చన, లక్ష్మీ అనంతపద్మనాభ స్వామికి, గోపాల కృష్ణమూర్తి, సీతరామచంద్ర స్వామికి, వేంకటేశ్వర స్వామికి ఉపనిత్తుల ద్వారా అభిషేకాలు చేశారు.

అద్దాల మంటపంలో గీతా పారాయణం, అనుబంధ దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలతో పాటు గీతా హోమం, గీతా ప్రవచనాలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల  విద్యార్థులచే భగవద్గీత పఠనం చేయించారు. 3 రోజుల పాటు రాజన్న ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 

రాజన్న సేవలో  ఆదిలాబాద్ ఎస్పీ 

అదిలాబాద్​ ఎస్పీ గౌస్​ ఆలం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శనం చేసుకున్నారు. తదనంతరం రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కళ్యాణ మండపంలో  ఆశీర్వచనం చేసి స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు.