IND vs NZ 3rd Test: భారత జట్టుపై గంభీర్ ప్రయోగాలు.. ఒక్కటి కూడా ఫలించలేదు

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి నుంచి భారత్ కు ఏదీ కలిసి రావడం లేదు. శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2 తో భారత జట్టును కోల్పోయింది. స్వదేశంలో 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ పై 2-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. తాజగా ముంబై టెస్టులోను భారత్ విజయం సాధించేందుకు శ్రమించక తప్పట్లేదు. దీనికి తోడు గంభీర్ చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. 

న్యూజిలాండ్ తో ముంబై టెస్ట్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో గంభీర్ మార్పులు చేశాడు. నైట్ వాచ్ మెన్ గా సిరాజ్ ను పంపించాడు. అయితే అసలు బ్యాటింగ్ రాని సిరాజ్ ను పంపించడం కంటే ఆకాష్ దీప్ ను పంపి ఉండాల్సింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిరాజ్ తొలి బంతికే ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ రనౌటయ్యాడు. రెండో రోజు ఆటలో భాగంగా సర్ఫరాజ్ కంటే ముందుగా జడేజాను ఆర్డర్ లో పైకి పంపించాడు. ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. జడేజా 14 పరుగులకే ఔట్ కాగా.. సర్ఫరాజ్ డకౌటయ్యాడు. 

Also Read : కంగారూల గడ్డపై సాయి సుదర్శన్ సెంచరీ

గంభీర్ చేస్తున్న ప్రయోగాలు.. సూచనలు భారత జట్టుకు ఉపయోగపడట్లేదు. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ గంభీర్ ముందున్న అగ్ని పరీక్ష. ఇది కూడా ఓడిపోతే అతని కోచ్ పదవి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో సుందర్ (14), అశ్విన్ (6) ఉన్నారు.