KL Rahul: ప్రపంచ క్రికెట్‌లో ఆ ప్రత్యేకత రాహుల్‌కే సొంతం: గంభీర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకముంచాడు. అతనొక అరుదైన రకమని ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే రాహుల్ ను ఓపెనర్ గా పరిగణిస్తామని గంభీర్ చెప్పుకొచ్చాడు. 

ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. రాహుల్ స్పెషల్ టాలెంట్ ను హైలెట్ చేశాడు. "కెఎల్ రాహుల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. అతను మూడో స్థానంలో.. అవసరమైతే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగల సామర్ద్యముంది. ఇలాంటి క్రికెటర్లు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ చూసుకుంటే రాహుల్ లాంటి ప్రతిభ కలిగిన ప్లేయర్లు ఎంతమంది ఉంటారు చెప్పండి". అని గంభీర్ అన్నాడు. 

ALSO READ | IND vs SA 2nd T20: అతనికి ఒక్క ఓవరే ఇస్తాడా.. చెత్త కెప్టెన్సీతో టీమిండియాను ముంచిన సూర్య

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన 18  మంది స్క్వాడ్ లో రాహుల్  సంపాదించాడు. ఇటీవలే న్యూజిలాండ్ పై తొలి టెస్టులో విఫలమైన తర్వాత రాహుల్ కు చివరి రెండు టెస్టుల్లో తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అయితే అనుభవం దుష్టిలో ఉంచుకొని రాహుల్ కు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ రావొచ్చు. సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది.