IND vs NZ 2nd Test: గంభీర్ అంచనా తప్పలేదు..ఏడాది ముందే సాంట్నర్‌ను పసిగట్టాడే

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఒక అంచనాకు రావడం కష్టం. అతని ఉద్దేశ్యం ఏదైనా చేసే కామెంట్స్ మాత్రం బోల్డ్ గా ఉంటాయి. ఈ కారణంగానే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ధైర్యంగా చెప్పగలడు అని పేరున్నా అతను చేసే కామెంట్స్ కి విమర్శలు తప్పవు. ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ముక్కు సూటిగా మాట్లాడం ఇతని ప్రత్యేకత. తాజాగా అతను ఏడాది క్రితం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

మిచెల్ ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. 2023 అక్టోబర్ లో గంభీర్ చేసిన ఈ ట్వీట్ అప్పుడు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచంలో ఇంతమంది స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉంటే.. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ను గంభీర్ బెస్ట్ స్పిన్నర్ అంటున్నాడేంటి అనుకున్నారందరు. అయితే కట్ చేస్తే గంభీర్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు నిజమేనేమో అనిపిస్తుంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో సాంట్నర్ 13 వికెట్లు తీసుకొని టీమిండియా ఓడిపోవడంతో కీలక పాత్ర పోషించాడు. 

Also Read :- పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్.. ఐదుగురు సీనియర్ ఆటగాళ్లు ఔట్

తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసుకున్న ఈ కివీస్ ఆల్ రౌండర్.. సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్, అశ్విన్ వికెట్లను రెండు ఇన్నింగ్స్ ల్లో తీసుకున్నాడు. సాంట్నర్ స్పిన్ ధాటికి భారత బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి టెస్టుకు తుది జట్టులో ఎంపిక కాని సాంట్నర్.. రెండో టెస్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.