IND vs NZ 2024: భారత జట్టులో ఆ రెండు సామర్ద్యాలున్నాయి: గౌతమ్ గంభీర్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది. అదే జరిగితే వరుసగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరిన జట్టుగా నిలుస్తుంది. ఇందులో భాగంగా మొదట న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు సిద్దమవుతుంది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకున్నట్టే.     

న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ సిరీస్ కు ముందు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరులతో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో భారత జట్టు సామర్ధ్యాలు గురించి మాట్లాడాడు. జట్టు అప్రోచ్ ఎలా ఉండబోతుందో తెలిపాడు. 

ALSO READ | PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్

 

టెస్ట్ క్రికెట్ లో రిస్క్ చేయడానికి భారత జట్టు ఏ మాత్రం వెనుకాడదని అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫలితం తమకు అనూకూలంగా మార్చుకుంటామని ధీమా వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు ఒకే రోజులో 400 పరుగులు చేయగలదని.. అదే సమయంలో చివరి రెండు రోజులు డ్రా కోసం బ్యాటింగ్ చేయగలదని చెప్పుకొచ్చాడు. డ్రెసింగ్ రూమ్‌లో చాలా మంది రెండు రోజులు బ్యాటింగ్ చేయగలరని.. అంతిమంగా మ్యాచ్ గెలవడమే తమ ఉద్దేశ్యమని గంభీర్ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు. 

న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది. అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా రెండో టెస్ట్.. నవంబర్ 1 నుంచి 5 వరకు ముంబై వాంఖడేలో చివరి టెస్ట్ ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-25) లో భాగంగా ఇరు జట్లకు ఇది కీలక సిరీస్.