మారిషన్ కంపెనీల అకౌంట్లు ఫ్రీజ్ కాలేదు

మారిషన్ కంపెనీల అకౌంట్లు ఫ్రీజ్ కాలేదు


న్యూఢిల్లీ: తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషన్ గ్రూపుల ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు వచ్చిన వార్తలపై అదానీ గ్రూపు కంపెనీల బాస్ గౌతమ్ అదానీ మొదటిసారి పెదవి విప్పారు. ఈ విషయమై కొన్ని మీడియాల్లో ‘తప్పుడు సమాచారం’ ప్రచారమైందని, కంపెనీలకు తమ షేర్​హోల్డర్స్​పై రెగ్యులేటరీ పవర్స్ ఉంటాయని అనుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో పూర్తి బాధ్యతారహితంగా వార్తలు రాయడం వల్ల అదానీ స్టాక్స్​కు ఎంతో నష్టం జరిగిందని అన్నారు.  తమ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్ల, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని కంపెనీ ఏజీఎం సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ కంపెనీల షేర్లు 100 శాతానికిపైగా లాభపడ్డాయని అన్నారు.  అదానీ గ్రూపుల్లో మొత్తం ఆరు మారిషన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయగా, మూడింటి అకౌంట్లను నేషనల్ షేర్ డిపాజిటరీ ఫ్రీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మే 31కి ముందే  ఈ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐల అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేసిందని మీడియా పేర్కొంది.  మనీ లాండరింగ్ చట్టం కింద ఓనర్షిప్ వివరాలను నిరూపించే డేటాను ప్రొవైడ్ చేయకపోవడం వల్లే ఈ అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేశారని పేర్కొంది. డీమాట్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఉన్న షేర్లను అమ్మడానికి కాని, కొత్తగా షేర్లను కొనడానికి వీలుండదు. దీంతో అదానీ కంపెనీల షేర్లు చాలా నష్టపోయాయి. ఈ మూడు కంపెనీలు అదానీ కంపెనీల్లో ఆరు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొన్నాయి. ‘‘ఇలాంటి పుకార్లు ఎన్ని వచ్చినా మేం తట్టుకుంటాం.  మాలో ఆత్మవిశ్వాసం ఉంది. ఎలాంటి చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అయినా ఎదుర్కొంటాం. మాకు ఎదురయ్యే సవాళ్లనే నిచ్చెనగా మార్చుకొని మరింత బలపడతాం. మా సెజ్, కంటెయినర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు భారీగా లాభాలు సాధిస్తున్నాయి. దేశంలోని 25 శాతం మంది విమాన ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు బిజినెస్ మాది”అని ఆయన స్పష్టం చేశారు. 

షేర్ల పతనంతో ఎంతో లాస్ 

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరు సంపాదించిన అదానీ షేర్ల పతనం వల్ల గత నెల కేవలం మూడు రోజుల్లో తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన సంపద (దాదాపు రూ.66,675 కోట్లు) కోల్పోయారు.  అదానీ గ్రూప్ షేర్లు ఈ ఏడాది విపరీతంగా ర్యాలీ చేయడంతో అదానీ సంపద దాదాపు అంబానీ స్థాయికి చేరింది. అయితే మారిషస్ కంపెనీ అకౌంట్లను నేషనల్ షేర్ డిపాజిటరీ ఫ్రీజ్ చేసిందని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మారిషస్ కంపెనీల అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదని, ఈ విషయంలో వచ్చిన వార్తలన్నీ అబద్ధాలన్నీ అదానీ ప్రకటించినా ఫలితం కనిపించలేదు. ఈ మారిషన్ కంపెనీల ‘అసెట్స్ అండర్ మేనేజ్​మెంట్​’లో 90 శాతం ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు అదానీ షేర్లలోనే ఉన్నాయి. ఫారిన్ ఫండ్స్ గత పదేళ్ల నుంచి తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని అదానీ ఎక్స్చేంజీలకు గత నెల 14న తెలిపింది.  పుకార్లను పట్టించుకోవద్దని కోరింది.   ఈ మూడు ఫండ్ల డీమాట్ అకౌంట్లు ఫ్రీజ్ కాలేదని రిజిస్ర్టార్​ అండ్ ట్రాన్స్​ఫర్ ఏజెంటు నుంచి జవాబు వచ్చిందని పేర్కొంది.  డీమాట్ అకౌంట్ ఫ్రీజ్ వార్తల వల్ల   గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్,  పోర్ట్స్ & సెజ్​ లిమిటెడ్,  పవర్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి.  గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ పోర్ట్స్, గనులు, విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు గనుల వ్యాపారాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది.  

15 లక్షల కోట్ల డాలర్లకు దేశ ఎకానమీ

మనదేశం అతిపెద్ద గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా ఎదుగుతుందని, ఐదు లక్షల కోట్ల డాలర్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే చేరుకుంటామని అదానీ అన్నారు. రాబోయే 20 ఏళ్లలో 15 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఎకానమీగా అవతరిస్తుందని ఈ సమావేశంలో వివరించారు. ఈజర్నీలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చని అన్నారు. ‘‘మనకు కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఇండియాలో వర్కింగ్ ఏజ్ జనాభా చాలా ఎక్కువ. కన్జంప్షన్ బాగుంది. ఇండియా గ్రోత్ తప్పకుండా బాగుంటుంది. తమ గ్రూపు కంపెనీల పనితీరు చాలా బాగుండటం వల్లే ఈ ఆర్థిక సంవత్సరం మొదటివారంలోనే 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించామని అన్నారు. ఇది మాకు చాలా పెద్ద విజయం’’ అని అదానీ అన్నారు.