MS Dhoni: అభిమానికి తీవ్ర నిరాశ.. రోజుల తరబడి నిరీక్షించిన కనికరించని ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ఫాలోయింగ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని మ్యాచ్ అంటే స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తారు. అడుగుపెడితే గ్రౌండ్ అంతా ధోనీ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులని సంపాదించుకున్న వారిలో ధోనీ ప్రధమ వరసలో ఉంటాడు. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ధోనీ ప్రస్తుతం ఒక విషయంలో విమర్శల పాలవుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గౌరవ్ కుమార్ అనే వీరాభిమాని ధోనీని కలుసుకోవడానికి ఏకంగా అతని ఇంటి వద్దకు వెళ్ళాడు. ఢిల్లీకి చెందిన అతను మహేంద్రుడిని కలుసుకోవడానికి సైకిల్‌పై ఢిల్లీ నుండి రాంచీకి దాదాపు 1,200 కి.మీ ప్రయాణించాడు. ధోనీ ఇంటి వద్ద బస ఏర్పాట చేసుకొని అక్కడే వారం పాటు మహీ కోసం ఎదురు చూశాడు. ఫామ్‌హౌస్ గేట్ల బయట ఒక టెంట్‌ వేసుకొని పడుకున్నాడు. అయితే ఇంత చేసినా అతనికి చివరికి నిరాశ మిగిలింది. ధోనీని కలవాలనే అతని కోరిక తీరకుండానే పోయింది. 

ALSO READ | IPL 2025: వేలంలోకి కేఎల్ రాహుల్‌.. రూ.20 కోట్లైనా తగ్గేది లేదంటున్న RCB!

ధోని తన ఫామ్‌హౌస్ వెలుపల దాదాపు ప్రతిరోజూ తన కారును ఆపి అభిమానులకు సెల్ఫీలు.. షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. అయితే తనను కలవడానికి గౌరవ్ పడ్డ కష్టాల గురించి ధోనీ గుర్తించలేకపోయాడు. మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ధోనీని కలుసుకోవడం చాలా కష్టం. అందుకే గౌరవ్ ఏకంగా మిస్టర్ కూల్ ను కలుసుకోవడానికి తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. అంతకముందు ధోనీని చూడడానికి ఢిల్లీ నుంచి చెన్నై వరకు సైకిల్ పై ప్రయాణించిన అప్పుడు కూడా అతనికి నిరాశ తప్పలేదు. 

ధోనీని కలుసుకోలేకపోయాననే బాధను సోషల్ మీడియా వేదికగా గౌరవ్ పంచుకున్నాడు. దీంతో ధోనీపై కొంతమంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ధోనీ అహంకారి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ధోనీ 2025 ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. అతను అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశముంది. చెన్నై సూపర్ కింగ్స్ కు 5 టైటిల్స్ అందించిన ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gᴀuʀᴀv Kumar (@epic_g7)