పౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేవ

పౌర్ణమి సందర్భంగా..  రేపు తిరుమలలో గరుడ సేకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమలలో  పౌర్ణమి సందర్భంగా రేపు అంటే 2024 మార్చి 25న గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

మరోవైపు నేటితో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ తెప్పలపై భూదేవి సమేతుడైన మలయప్పస్వామి విహరించనున్నారు  ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.  ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.  ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో   భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కాగా  నిన్న శ్రీవారిని దర్శించుకున్న   72 వేల 986 మంది భక్తులు దర్శించుకోగా 33 వేల  482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.