వైసీపీ వైపు గంటా చూపు..!

గంటా శ్రీనివాసరావు టీడీపీతో తన ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలలో ఎమ్మెల్యే,మంత్రిగా వ్యవరించి2009 లో  2014 లో భీమిలి నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2019లో తిరిగి టీడీపీలో చేరి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతకుముందు అనకాపల్లి నుంచి పీఆర్పీ తరపున 2009లో ఎమ్మెల్కేగా గెలిచారు. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గంటా వైసీపీలో చేరనున్నాడని ప్రచారం ఊపందుకుంది. తాను ఆశించిన భీమిలి టికెట్ తనకు కేటాయించకపోవటంతో గంటా పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే గంటా వైసీపీ శ్రేణులతో టచ్ లోకి వచ్చారని, త్వరలోనే వైసీపీలో చేరతారని కూడా టాక్ వినిపిస్తోంది. టీడీపీ రెండో జాబితాలో గంటాకు టికెట్ కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ తాను ఆశించిన భీమిలి నుండి టికెట్ కేటాయించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

టాక్ వినిపిస్తున్నట్టుగా గంటా వైసీపీలో చేరితే, ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ గంటాకు ఎక్కడ నుండి టికెట్ కేటాయిస్తుందో అన్న చర్చ మొదలైంది. మరి, అసమ్మతి సెగ ఊపందుకున్న సమయంలో వైసీపీలో గంటకు సముచిత స్థానం దక్కుతుందా లేదా చూడాలి.