గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనచరులు అరెస్ట్.. కంకిపాడు పీఎస్ కు తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ రోజు ( నవంబర్ 19) తెల్లవారుజామున  వంశీ ప్రధాన అనుచరులు  ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి ,భీమవరపు యేతంధ్ర రామకృష్ణ(రాము),మేచినేని బాబు,సూరపనేని అనీల్ గోన్నూరి సీమయ్య, గుర్రం నానిలు అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం అందుతోంది.  అయితే వీరిని ఏ కేసులో అరెస్ట్ చేశారో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

 అయితే కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారంలో గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.  కంకిపాడు పోలీస్ స్టేషన్ కు అరెస్టైన వారి కుటుంబసభ్యులు.. వైసీపీ నేతలతో పాటు వంశీ అభిమానులు  తరలి వెళ్తున్నారు.