హైదరాబాద్ లో టీస్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారంలోని ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడలో టీ స్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు. బుధవారం ( డిసెంబర్ 18, 2024 ) పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 1 కిలోకు పైగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read :- బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు టీ స్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. 1 కేజీ కి పైగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు.