క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కి గంగూలీ గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. CAC సభ్యుడిగానే ఉంటూనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా పనిచేస్తున్నాడు. రెండు ఆదాయాలు వచ్చే పనులు చేసే అంశంపై గంగూలీ పై ఓ అభిమాని ఫిర్యాడు చేశాడు. ఇప్పటికే దాదాకు నోటీసులు జారీ చేసిన అంబుడ్స్‌మన్, తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో శనివారం BCCI అంబుడ్స్‌మన్ డీకె జైన్ ముందు దాదా హాజరుకానున్నాడు. దీందో గంగూలీ ఏదో ఒక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావడంతో CAC కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. గంగూలీ ఏమైనా చెప్పాలనుకుంటే అంబుడ్స్‌మన్ ముందు చెప్పుకోవచ్చని సూచించింది. దీంతో దాదా ఢిల్లీతో కొనసాగాలంటే CAC కి దూరం కావాల్సి ఉంటుంది. అయితే దాదా మాత్రం CACకి గుడ్‌బై చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
