ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు. అయితే ఇవాళ్టి(బుధవారం) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్లో తెలిపారు. జోషీమఠం దగ్గర బద్రీనాథ్ హైవేను మూసివేయడంతో.. ఇప్పుడే బద్రీనాథ్ యాత్రను ప్రారంభించడం లేదన్నారు. త్వరలోనే ఈ యాత్రను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
