మొబైల్‌‌‌‌కు లింక్‌‌‌‌లు పంపి డబ్బులు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌

  • నిందితుల్లో సిద్దిపేట బంధన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌
  • ముగ్గురు అరెస్ట్‌‌‌‌, పరారీలో మరొకరు
  • వివరాలు వెల్లడించిన పాలమూరు ఎస్పీ జానకి

జడ్చర్ల , వెలుగు : మొబైల్‌‌‌‌కు లింక్స్‌‌‌‌ పంపించి డబ్బులు కాజేస్తున్న ఓ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను జడ్చర్ల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... వల్లోజు శిరీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ అనే వ్యక్తి సిద్దిపేటలోని బంధన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఇతడు సయ్యద్‌‌‌‌ ముస్తఫా, అబ్దుల్ ఫహాద్, మహ్మద్‌‌‌‌ సమీర్‌‌‌‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 

నలుగురు కలిసి పలువురి మొబైల్స్‌‌‌‌కు లింక్స్‌‌‌‌ పంపించి వారి అకౌంట్లలోని డబ్బులు కాజేయాలని ప్లాన్‌‌‌‌ చేశారు. ఇందులో భాగంగా జడ్చర్ల పట్టణంలోని బాబీ స్ట్రీట్‌‌‌‌కు చెందిన సునీల్‌‌‌‌ జవహర్‌‌‌‌ మొబైల్‌‌‌‌కు ఏడు నెలల కింద పలు వెబ్‌‌‌‌సైట్ల పేరుతో లింక్‌‌‌‌లు పంపించారు.

 జవహర్‌‌‌‌ ఆ లింక్‌‌‌‌లను ఓపెన్‌‌‌‌ చేయడంతో అతడి అకౌంట్లలో ఉన్న రూ. 36 లక్షలు మాయం అయ్యాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ సెక్యూరిటీ సాయంతో ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేశారు. బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ శిరీశ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు అబ్దుల్‌‌‌‌ ఫహాద్‌‌‌‌, సయ్యద్‌‌‌‌ ముస్తఫాను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు పంపించగా, మరో నిందితుడు సయ్యద్‌‌‌‌ సమీర్‌‌‌‌ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటిసారి సైబర్ క్రైమ్ ఛేదించడం పట్ల ఎస్పీ జానకి జడ్చర్ల పోలీసులను అభినందించారు. సమావేశంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్‌‌‌‌ ఉన్నారు.