నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల సోమేశ్వరాలయంలోని వినాయక విగ్రహాన్ని గుర్తుతెలియని దొంగలు అపహరించారు. వినాయక చవితి రోజునే విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. జలాశయం సమీపంలోని అతి పురాతనమైన శివాలయంలో వందల ఏళ్లనాటి వినాయక విగ్రహాన్ని భక్తుల రూపంలో గుడికి వచ్చి ఎత్తుకెళ్ళినట్లు ఆ గుడి పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
