శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం

కర్నూలు: భూ కైలాసగిరి.. శ్రీశైల మహాక్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు.. ఈవో రామారావు ల ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కరోనా నిబంధనల కారణంగా ముఖ్య అర్చకులు.. వేద పండితులు కొద్ది మంది ఆధ్వర్యంలోనే ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణములోని రత్నగర్భ గణపతి స్వామివారికి ఈవో కె.ఎస్. రామారావు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పరివార ఆలయంలోని సాక్షి గణపతి స్వామివారికి కూడా విశేష పూజలు, గణపతి హోమం జరిపించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని.. ప్రతిరోజు జపానుష్ఠాలు, ఉపనిషత్ పారాయణలు నిర్వహిస్తారు. ఇవాళ సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది. ఈనెల 31న ఉత్సవాల ముగింపు జరుగుతుందని ఈవో రామారావు తెలిపారు.