బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కుట్ర

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కుట్ర

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ధన బలంతో ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ పార్టీలను చీలుస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

‘‘బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగిస్తోంది. ధన బలంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో చీలికలు సృష్టిస్తున్నారు. తమకే ఓటేయాలని ప్రజలను బలవంతపెడుతున్నారు’’ అని సిన్హా వ్యాఖ్యానించారు. ‘‘నా పోరాటం కేవలం రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం కాదు. దారితప్పి దుర్వినియోగం అవుతున్న దర్యాప్తు సంస్థలపైనా పోరాటం కొనసాగిస్త. అవి మితిమీరిన అధికారాలతో చెలరేగుతున్నాయి’’ అని ఆయన మండిపడ్డారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.