Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంత..?

రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer) మరో మూడ్రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. జనవరి 10న రీలిజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మంచిగానే జరిగిందని సమాచారం. మరి తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ బిజినెస్ ఎలా జరిగింది. టార్గెట్ ఎంత? అనేది చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.127 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిందని టాక్. కేవలం నైజాం ఏరియాలోనే రూ.44 కోట్ల బిజినెస్ చేసిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రామ్ చరణ్ కెరియర్లోనే నైజామ్ ఏరియాలో హయ్యెస్ట్ బిజినెస్ ఇది.

అయితే, మెగా ఫ్యామిలీకి నైజాం ఏరియా చాలాసార్లు కలిసొచ్చింది. ఇక్కడ RRR మూవీకి రూ.70 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఆ తర్వాత రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీకి రూ.38.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక అంతకుముందు వచ్చిన వినయ విధేయ రామ మూవీ రూ.24 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ రూ.44 కోట్ల బిజినెస్ చేయడంతో.. కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది అర్ధం చేసుకోవొచ్చు. జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ మోత మోగిపోవడం కన్ఫమ్. 

ALSO READ | OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇకపోతే.. గేమ్ ఛేంజర్ మూవీకి సీడెడ్‌లో రూ.24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులు దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో రూ.15 కోట్లు, గుంటూరులో రూ.11 కోట్లు, ఈస్ట్‌ రూ.10.5 కోట్లు, వెస్ట్‌ రూ.9 కోట్లు, కృష్ణ 8.5 కోట్లు, నెల్లూరు రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.127 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమే కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అవుతుంది కనుక (తమిళ, కన్నడ, నార్త్ ) భారీ మొత్తంలోనే బిజినేస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నార్త్ లో చరణ్ ఉన్న క్రేజ్ బట్టి పెద్ద అమౌంట్ లోనే బిజినెస్ జరిగినట్లు టాక్. మలయాళంలో అనుకున్నంత లేకపోయిన తమిళ, కన్నడ భాషల్లో మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇండియాతో పాటు ఓవర్సీస్ అంత కలుపుకుని బిజినెస్ రూ.200-230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇండియా వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.175-185 కోట్ల వరకు జరిపిందని టాక్.

పుష్ప 2 మాదిరి గేమ్ ఛేంజర్ హిందీ బెల్ట్లో విజృంభణం చేస్తే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.150 కోట్ల రూపాయల షేర్, రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రికార్డ్ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు రూ.200 కోట్లు వెచ్చించి మరి సౌత్,నార్త్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్లు సమాచారం.