గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా విడుదల రోజు 6 షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. తర్వాతి రోజు (జనవరి 11) నుంచి జనవరి 23వ తేదీ వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ రేట్‎ను రూ.600 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్‎ల్లో టికెట్ ధరకు అదనంగా 175 రూపాయలు పెంపు,  సింగిల్ స్క్రీన్స్‎లో టికెట్ రేట్‎కు అదనంగా 135 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ALSO READ | తండేల్ నుంచి నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్... సాయిపల్లవి డ్యాన్స్ సూపర్..

 ఫుష్ప 2 సినిమా ఎఫెక్ట్ తో తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపునకు అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025, జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. దీంతో గేమ్ ఛేంజర్ కోసం చెర్రీ, మెగా అభిమానులు ఈగర్‎గా వెయిట్ చేస్తున్నారు.