టీమిండియా మాజీ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు రిటైర్మెంట్ క్రికెట్ లో ఇష్యూ అవుతోంది. టాలెంట్ ఉన్నాకూడా రాయుడుకు బీసీసీఐ అవకాశాలు కల్పించలేకపోయిందంటూ .. సహచరులు అసంతృప్తి, ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాజీ ఓపెనర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఓ అడుగు ముందుకేసి.. బీసీసీఐ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
బీసీసీఐలో ప్రస్తుతం ఉన్న సెలెక్షన్ ప్యానెల్ సభ్యుల్లో ఒక్కరు కూడా కెరీర్ ను పూర్తిచేయలేకపోయారని అన్నారు గౌతమ్ గంభీర్. ఈ విషయం తనను ఆశ్చర్యానికి లోను చేస్తోందని అన్నారు. వాళ్లు ఎలాగూ కెరీర్ లో రాణించలేదు కానీ.. టాలెంట్ ఉన్న అంబటి రాయుడు లాంటివారికైనా ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. టైటిళ్లు, టోర్నమెంట్లు గెలవడం అనేది ఎంత ముఖ్యమో…. ఆటగాళ్ల మనసులు గెల్చుకోవడం అంతకంటే ముఖ్యమన్న సంగతి మరిచిపోవద్దని అన్నారు గౌతమ్ గంభీర్.
