దసరాలోపు కల్యాణలక్ష్మి చెక్కులు పంచాలి:గజ్వేల్ కాంగ్రెస్ లీడర్లు

  • లేదంటే లబ్ధిదారులతో కలిసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇంటికే వెళ్తాం
  • గజ్వేల్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు

గజ్వేల్, వెలుగు:‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బయటకు రాకపోవడంతో పది నెలలుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిలిచిపోయింది.. దసరా లోపు చెక్కులు పంపిణీ చేయాలి.. లేదంటే లబ్ధిదారులతో కలిసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇంటికే వెళ్తాం’ అని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వంటేరు నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జీపీపీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గాడిపల్లి భాస్కర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫొటోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కుల పంపిణీ నిలిచిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేనిదే చెక్కుల పంపిణీ కుదరదని ఆఫీసర్లు చెబుతున్నారని వాపోయారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే ఆయన ముఖం చూపకుండా అన్యాయం చేస్తున్నారన్నారు.

 గజ్వేల్‌‌‌‌‌‌‌‌ నియోజకర్గంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయని, బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం, రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇంకా కేటాయింపులు చేయలేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వెంటనే గజ్వేల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి సమస్యలు పరిష్కరించాలని నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నామన్నారు. 

లేదంటే ఆయన వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సర్దార్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, నాయకులు వెంకట్‌‌‌‌‌‌‌‌ నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మోహన్‌‌‌‌‌‌‌‌, సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.