సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ఇంటికి వెళ్లిన బండ్ల.. రేవంత్​తో భేటీ అయ్యారు. ఇటీ వలే బీఆర్ఎస్ కు గుడ్​బై చెప్పి, కాంగ్రెస్ లో చేరిన  కృష్ణ మోహన్ రెడ్డి.. మళ్లీ సొంత గూటికి పోతున్నట్లు ప్రకటించడంతో కాం గ్రెస్ లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

ఈ పరిస్థితుల్లో ఆయన సీఎం రేవంత్ ను కలవడంతో ఇక బండ్ల కాంగ్రెస్ లోనే కొనసాగను న్నారనే సంకేతాలను ఇచ్చినట్ల యిందని ఆ పార్టీ  నేతలు అంటు న్నారు. వారం రోజులుగా బండ్ల విషయంలో కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెరపడినట్లయింది.