కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : సంతోష్

గద్వాల, వెలుగు: ఎరువులు, విత్తనాలకు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ప్రతి ఫర్టిలైజర్ షాపులో స్టాక్, అమ్మకాల బోర్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. మండలాల్లోని అగ్రికల్చర్ ఆఫీసర్లు జూన్ 15 నాటికి అన్ని షాపులను తనిఖీ చేయాలని సూచించారు. 

నాగర్ కర్నూల్ టౌన్: వానాకాలం సాగు సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల అమ్మకాలపై అధికారులు పటిష్ఠ నిఘా పెట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలతో  ఆయన సమావేశం నిర్వహించారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాలో 4.59 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేస్తారని, అత్యధికంగా పత్తి, వరి, మొక్కజొన్న సాగు జరుగుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 663 విత్తన విక్రయ కేంద్రాలు ఉన్నాయన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టడానికి మండలానికో ప్రత్యేక టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో ఏఈవోలు పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 

కోడేరు: నాగర్ కర్నూల్ జిల్లాలో పత్తి విత్తనాలు, పచ్చిరొట్ట,  జీలుగు విత్తనాలు, ఎరువుల కొరత లేదని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్ కుమార్  అన్నారు. గురువారం సాయంత్రం పెద్దకొత్తపల్లిలోని గోదామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.