నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

గద్వాల, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకలపై కలెక్టరేట్​లో గురువారం ఆయన మీటింగ్ నిర్వహించారు. అన్ని ఆఫీసుల్లో ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ చేసి, 9 గంటలకు కలెక్టరేట్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రామ్ చందర్ తదితరులు ఉన్నారు. 

నాగర్ కర్నూల్ టౌన్:  రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవెన్యూ అడిషనల్  కలెక్టర్ సీతారామారావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ పోలీస్ గ్రౌండ్​లో  జూన్ 2న జరిగే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.