ప్రాజెక్టులను పరిశీలించిన కలెక్టర్

గద్వాల, వెలుగు: జూరాల, గుడ్డం దొడ్డి రిజర్వాయర్లు, పంప్ హౌస్, గట్టు లిఫ్ట్ పంపు హౌస్​లను ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి గద్వాల కలెక్టర్ సంతోష్ శనివారం పరిశీలించారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం, ప్రస్తుత నిలువలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా నీటిని నిల్వ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఆఫీసర్లు రహీముద్దీన్, జుబేర్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.