ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. అడిషనల్  కలెక్టర్లు నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాగర్​కర్నూల్​ అడిషనల్​ కలెక్టర్  సీతారామారావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా అధికారులు అర్జీలపై వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. కలెక్టరేట్  ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు
 పాల్గొన్నారు.

పోలీస్​ ప్రజావాణికి 6 ఫిర్యాదులు..

వనపర్తి: జిల్లా పోలీస్​ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్​ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్​స్టేషన్​ ఎస్ఐలతో మాట్లాడి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.