అలంపూర్​లో భవనాన్ని వినియోగించుకోవాలి : సంతోష్

గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రసాద్  స్కీం కింద నిర్మించిన బిల్డింగ్​ను సద్వినియోగం చేసుకోవాలని గద్వాల కలెక్టర్  సంతోష్  కోరారు. ఆలంపూర్  జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి ఆలయం దగ్గర ప్రసాద్  స్కీం ఫండ్స్​తో నిర్మించిన బిల్డింగ్​ను గురువారం శ్రీనగర్  నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. స్వదేశీ దర్శన్ లో భాగంగా బిల్డింగ్​ను జాతికి అంకితం చేశారు. 

కలెక్టరేట్ లో పర్యటకశాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్​ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ అలంపూర్ లో రూ.38 కోట్లతో నిర్మించిన బిల్డింగ్​లు ప్రారంభించడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిల్డింగ్  పనులు 90 శాతం కంప్లీట్ అయ్యాయని, 10 శాతం పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామన్నారు. అడిషనల్  కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, వెంకటేశ్వర్లు, ఏవో భద్రప్ప, ఈవో పురేందర్  పాల్గొన్నారు.