పంజాగుట్ట, వెలుగు: నాగర్‌కర్నూల్‌జిల్లా అమ్రాబాద్మండలం మన్ననూర్‌లో అక్టోబరు 5న ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్టు గద్దర్‌గళం ప్రకటించింది. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో గద్దర్బిడ్డ వెన్నెల పాల్గొని విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేశారు.
విగ్రహాన్ని ప్రొఫెసర్కంచె ఐలయ్య ఆవిష్కరిస్తారని కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్తెలిపారు. అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, విమలక్క, సీనియర్జర్నలిస్టు పాశం యాదగిరి పాల్గొంటారని చెప్పారు. డాక్టర్బాలబోయిన సుదర్శన్, కాంగ్రెస్ కౌన్సిలర్కొల్లూరి భరత్, ఏపూరి సోమన్న పాల్గొన్నారు.
